News
డీకె అరుణ బొమ్మాళి
గద్వాలను జిల్లా చేయాలంటూ హైదరాబాద్ లో దీక్షకు దిగిన మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకె అరుణ ను నిశితంగా విమర్శించారు ఎంపీ కవిత. ఏ ఏరియాను జిల్లా చేయాలి, ఏది అనవసరం అన్నది ప్రభుత్వం చూసుకుంటుందని, పూర్తి శాస్త్రీయ అధ్యయనం చేశాకే, పరిశీలించాకే ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చిందని, అరుణ అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని కవిత అన్నారు. “కేసీఆర్ గారిపై నోరు పారేసుకుంటారా ఇదేనా మీ సంస్కారం ఇష్టానుసారం మాట్లాడడం మానుకోండి అని కవిత దుయ్యబట్టారు డీకె అరుణను తెలంగాణా కు బొమ్మాళిగా అభివర్ణించిన కవిత ప్రజలను ఊరికే రెచ్చగొట్టకుండా గద్వాల కోటలో రెస్ట్ తీసుకోండని ఆమెకు సలహా ఇచ్చారు. జిల్లాల విభజన వెనుక రాజకీయం ఏమీ లేదని, తన ప్రాంతంలో రాజకీయంగా లాభపడడానికి అరుణ ఈ ఇష్యూని ఎంచుకున్నారని, అయినా ఆమె తీరును గద్వాల ప్రజలే అంగీకరించరని కవిత వ్యాఖ్యానించారు. కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్‌కు స్పష్టత ఉందని తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








